Sunday, November 1, 2009

ఉచ్చిష్ట గణపతి అందరికీ శుభము కలిగించు గాక.

ఇది ఉచ్చిష్ట గణపతి చిత్రం.చాలా అరుదైనది. బౌధ్ధం లో ఈయననే రక్త గణపతి అని కుడా అంటారు.ఈ గణపతి సాధన చాలా విశిష్టమైనది.1988 లో నేను అనేక సమస్యల లో ఉండే్వాడిని, జీవనం చాలా కఠినంగా ఉండేది.ఆ సమయం లో ఒక గురు మిత్రుని ద్వారా ఉచ్చిష్ట గణపతి మంత్రం గ్రహించాను.చాలా శ్రధ్ధగా మంత్ర జపం చేసేవాడిని.క్రమేణా మార్పు వచ్చింది. ఆరు సంవత్సరాలు చాలా నిష్ఠగా జపం కొన సాగించాను.మరి రెండు సంవత్సరాలకు ధన విషయకంగా అభివృధ్ధి కనపడింది.అప్పుడే జ్యోతిషం కూడా వృత్తి పరంగా మొదలు పెట్టాను.చాలా బాగా రాణించడం ప్రారంభమైంది.ఇక ఆపై తిరిగి చూసే అవకాశం లేకుండా దిన దిన  ప్రవర్ధమానమై ధనమూ, కీర్తి,రావడం మొదలైంది.
అతి ముఖ్యులైన కొందరికి ఉపదేశం కుడా ఇవ్వడం జరిగింది.వారూ అభివృధ్ధి లోనికి వచ్చారు.జ్యోతిషం లొ ఏది చెప్పినా అక్షరాలా జరగడం మొదలైంది.నాదగ్గర  ఉపదేశం పుచ్చుకున్న వారిలొ ఇద్దరు అఖండ కోటీశ్వరులైనారు. అది వారి సాధనా ఫలితమేనని,భావిస్తున్నాను.ఆ తరువాత సాధన యింకా బాగా జరిగింది భువనేశ్వరీ ఏకాక్షరీ బీజం పది లక్షలు జపం చేసాను,పిదప కాళీ మంత్రం శ్రధ్ధగా పురశ్చరణ పూర్తి  చేసాను.
ఆ తరువాత నా మనస్సు నా అభీష్ట దైవమైన శివుని ఉపాసన వైపు మరలింది.1996 నుంచీ శివ దీక్ష మొదలు పెట్టాను.అక్షర లక్షలు జపం పూర్తి చేసాను. ప్రతీ సంవత్సరం ఒక జ్యోతిర్లింగం మహాశివరాత్రి నాడు దర్శించి భక్తి తో ఆ కరుణా సాగరుడైన కపర్దిని భావించి ఆత్మ తత్వ జిజ్ఞాసతో వైరాగ్య భిక్ష కోరడం ప్రారంభిం చాను.ప్రస్తుతం ఆ శివుని అనుగ్రహం వల్ల అంతా బాగానే ఉన్నది.మొట్టమొదటిసారిగా  తెలుగు లో "ఉచ్చిష్ట గణపతి" పై ఒక పుస్తకం ప్రచురించాను.దాని పేరు"ఉచ్చిష్ఠ గణపతి ప్రయోగం".  ఆ తరువాత ఆ శివానుగ్రహం వలన తెలుగు భాష లొ  64 తంత్రాలు వ్రాసి ప్రచురించాలనే సంకల్పం కలిగింది.ఇప్పటికి సుమారు 40 తంత్రాలు ముద్రణ అయ్యాయి.మిగిలినవి త్వరలో ప్రచురణ కాబోతున్నాయి. అవి ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయి.అదే నాకు సంతృప్తి.ఎంతోమందికి ఎన్నో సాధనా సందేహాలు ,మంత్ర-తంత్ర- సంబంధమైనవి వివరణనిచ్చి వారి పురోగమనానికి సహాయపడ్డాను. ఎన్నో పుస్తకాలు పి.డి.యఫ్ లోనివి సంస్కృతం-తెలుగు-ఇంగ్లీష్ భాషలలోనివి సేకరించాను. వాటిని సాధకులకూ పిపఠిష గలవారికీ ఉచితంగా ఇస్తున్నాను.అసాధారణమైన ,అరుదైన పుస్తకాలు నాదగ్గర ఉన్నాయి.నివృత్తి మార్గం లో గమ్యం చేరాలనే నా ఆకాంక్ష. శివోऽహం.

9 comments:

  1. aruduina chitram nu andinchinaduku danya vadamulu sampath garu

    ReplyDelete
  2. Namasthe Panditji,

    Maha Adbhutam. I have no words to describe about some books you wrote. Amazing depth and deep perspective especially about "vamacharya".

    At you feet
    Srikanth

    ReplyDelete
  3. Where can I get the 40 Tantras published by you

    ReplyDelete
  4. Namaste Samath kumar Guruji,

    I am Satya Peri very much interested in Vedic Astrology. I have done my Diploma in Praveena and Visarada courses from ICAS Delhi. ICAS is an institute started by Sri B V RAMAN with an aim to spread the divine science.

    Presently I am teaching Astrology classes at ICAS Secunderabad Chapter. When i am searching for some ancient telugu astrology books, I came across the book, Jyothisa Saramu, posted by you.

    May I request you to send me, including the Jyothisha Saramu, any astrology books (telugu or english) written by you and other ancient scholars Please.

    Pranam Guruji,

    Saya Peri
    snperi@gmail.com

    ReplyDelete
  5. where can i get the book of uchishta ganapati i want to start it please help.
    ramadasu

    ReplyDelete
  6. Can we download your Sapramana Jyothisha Saramu by Varada Chari

    ReplyDelete
  7. sampath garu,

    mee jyothishya sarwasam in chudadam jarigindi
    tadwara mee blog chusanu,meeku naa abhinandanalu
    rajendraprasadm
    rpmummaneni@gmail.com

    ReplyDelete
  8. సంపత్ గారు..మీకు ధన్య వాదములు..ఆ పరమ శివుని కృప వలన మీ వంటి సాధకుల పరిచయం కలిగింది అని భావిస్తున్నాను..మీరు రాసిన ఉచ్చిష్ఠ గణపతి ప్రయోగం, మరియు మీరు రాసిన ఇతర 40 తంత్ర గ్రంధాలను గూర్చి తెలుసుకోవాలని ఉంది... మీ పరిచయం కోసం వేచి చూస్తూ....శివోహం....కాళీనరేన్.

    ReplyDelete
  9. Sampath kumar garu...very glad to see your blog and your research and books. I feel happy to see a truthseeker like you who is having desire of realising Siva Consiousness..Please let me know if we can contact on phone. Will wait for your reply...
    KaliNareN

    ReplyDelete